Gossipsఆన్ లైన్ లో టాక్సీవాలా ఫుల్ మూవీ.. షాక్ లో విజయ్...

ఆన్ లైన్ లో టాక్సీవాలా ఫుల్ మూవీ.. షాక్ లో విజయ్ దేవరకొండ..!

ఓ పక్క విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సూపర్ సక్సెస్ అయ్యిందని ఫుల్ జోష్ లో ఉన్న హీరోకి మరో షాక్ తగిలింది. లేటెస్ట్ గా విజయ్ నటిస్తున్న టాక్సీవాలా సినిమా త్వరలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆ సినిమా కూడా మొత్తం సినిమా ఆన్ లైన్ లో లీక్ అయినట్టు తెలుస్తుంది. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఈ సినిమా అప్లోడ్ చేశారట.

అయితే వెంటనే ఈ విషయాన్ని కనిపెట్టిన చిత్ర దర్శక నిర్మాతలు సైబర్ క్రైం లో ఫిర్యాదు చేశారు. నిందుతులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలంటూ కేసు పెట్టి వచ్చారు. ఈమధ్య రిలీజ్ అయిన విజయ్ గీతా గోవిందం సినిమా కూడా రిలీజ్ ముందే వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మరి టాక్సీవాలా పరిస్థితి ఏంటో చూడాలి. అసలైతే ఇప్పుడప్పుడే రిలీజ్ ఆలోచన లేని టాక్సీవాలా దర్శక నిర్మాతలు సడెన్ గా డెశిషన్ మార్చుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా చేసేస్తారని అంటున్నారు. మరి విజయ్ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది మాత్రం ఆలోచించాల్సిన విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news