జూనియర్ లెక్క తేలుస్తాడా..!

ntr movie target

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ హంగామా మొదలు పెట్టిన చిత్రయూనిట్ సినిమాను అనుకున్న రేంజ్ లో ప్రమోట్ చేసి అదే రేంజ్ లో కలక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసిందే.

దసరా బరిలో దుమ్ముదులిపేలా రిలీజ్ అవుతున్న తారక్ గురువారం మొదలు ఆదివారం దాకా అంటే నాలుగు రోజుల్లోనే 100 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. సినిమా కు మ్యాక్సిమం ఆక్యుపెన్సీ ఉంటుంది. కాబట్టి తొలి వారాంతరంలోనే సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యాడు ఎన్.టి.ఆర్. ఇది కచ్చితంగా జూనియర్ స్టామినా తెలియచేసే సినిమా అని అంటున్నారు.

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్వింగ్ జరా అంటూ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. మరి తారక్ పెట్టుకున్న 100 కోట్ల టార్గెట్ సినిమా రీచ్ అవుతుందా లేదా రీచ్ అయితే ఎన్ని రోజుల్లో అది జరుగుతుంది అన్నది చూడాలి.

Leave a comment