Gossipsషాకింగ్ ...! తారక్ ప్రేమాయణం.. ఎవరితోనో తెలుసా ?

షాకింగ్ …! తారక్ ప్రేమాయణం.. ఎవరితోనో తెలుసా ?

యంగ్ ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ఈ యంగ్ హీరో చేసిన సినిమాలు అన్నీ ఒక్కసారి చూసుకుంటే .. ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలో నటించింది లేదు. కానీ ఈ సరికొత్త పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింత మరింత పెంచుతుందనడంలో సందేహమే లేదు.

ఇప్పటివరకు వరకు మాస్ కమర్షియల్ చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ క్లాస్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్యనే తన స్టైల్ మార్చుకుని ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో క్లాస్ గా కనిపించాడు. అయితే పూర్తి స్థాయి లవర్ బాయ్ గా మాత్రం కనిపించలేదు. ఈసారి ఆ సరదా కూడా తీర్చుకోబోతున్నాడు. యంగ్ టైగర్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమాలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త క్లాస్ టచ్ కూడా ఇస్తున్నారట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యేరెక్టర్ లవర్ బాయ్ లక్షణాలు ఎక్కువ, యాక్షన్ సీన్లు తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమే త్రివిక్రమ్ కు చెప్పి ఆ ప్రకారమే కథ సిద్ధం చేయమని సూచించాడట ఎన్టీఆర్. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బరువుని తగ్గించుకునే పనిలో పడ్డాడు. దీని కోసం ప్రత్యేకంగా ఓకే త్రినేర్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ యంగ్ తారక రాముడు. అయితే ఈ లవర్ బాయ్ పక్కన నటించబోయే ఆ లవ్లీ గర్ల్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news