డేటింగ్ పై సంచలన కామెంట్స్ చేసిన తాప్సి

Tapsi shocking comments on dating

తెలుగులో ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత తన టాలెంట్ చూపించే ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా ఫలితం అందుకోలేదు. ఇప్పటికి తెలుగులో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న తాప్సీ బాలీవుడ్ లో మాత్రం దూసుకెళ్తుంది. అక్కడ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు ఫైనల్ గా కంగనా రనౌత్ తర్వాత సోలో హీరోయిన్ గా అంత పాపులారిటీ తెచ్చుకుంది.

అక్కడ స్టార్స్ ఇంటర్వ్యూస్ లో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో తెలిసిందే. అలానే తాప్సీని ఫస్ట్ డేటింగ్ విషయాలను అడుగగా తన 9వ తరగతిలోనే డేటింగ్ చేశానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది తాప్సి. తన తొమ్మిదవ తరగతి చదివే టైంలో తన క్లాస్మెట్ ఒకతనితో డేటింగ్ చేశానని.. అతనితో రోజూ ఫోన్ లో మాట్లాడే దాన్ని అని చెప్పుకొచ్చింది తాప్సీ. తనకు ఫోన్ లేకున్నా టెలిఫోన్ బూత్ కు వెళ్లిమరి అతనికి కాల్ చేసేదాన్ని అని చెప్పింది. అయితే ఆ డేటింగ్ ఎన్నాళ్లో కొనసాగలేదని ఎక్సాంస్ రాగనే అతనో దారి తానో దారి చూసుకున్నామని.. ఆ తర్వాత కలిసింది కూడా లేదని చెప్పింది తాప్సి.

మొత్తానికి చిన్నతనంలోనే తాప్సీ డేటింగ్ అనుభవాలు తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న తాప్సి తెలుగులో ఇక నటించడం కష్టమే అంటున్నారు. ఇక్కడ సరైన ఛాన్సులు రాకనే అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. ఇక్కడ సక్సెస్ అవని తాప్సి బీ టౌన్ లో మాత్రం వరుస విజయాలు అందుకుంటుంది.

Leave a comment