ఘాటు ముద్దులతో వేడెక్కించిన తాప్సీ.. బాబోయ్ మరీ ఇంతా!

33

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ తొలిసినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసినా కూడా అమ్మడికి ఇక్కడ పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. దీంతో తమిళంలో కూడా అమ్మడు తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఈమెకు చుక్కెదురయ్యింది. దీంతో బాలీవుడ్‌లో పాగా వేద్దామని వెళ్లి అక్కడ తన లక్కును చెక్ చేసుకుంది.

అయితే అక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తాప్సీ చేతికి చిక్కడంతో సక్సెస్‌ కొట్టింది ఈ బ్యూటీ. ఇప్పటికే పింక్, జుడ్వా 2, ముల్క్ వంటి సినిమాలతో దుమ్ములేపుతున్న తాప్సీ మరోసారి బాలీవుడ్ జనాల చూపును తనవైపు తిప్పుకుంది. తన తాజా చిత్రం ‘మన్మార్జియాన్’లో అదిరిపోయే ఘాటు లిప్‌లాక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విశాల్ కౌశల్‌తో కలిసి తాప్సీ చాలా ఘాటైన లిప్‌లాక్ సీన్స్ చేసింది. దీంతో ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే వ్యూస్ వస్తున్నాయి.

తాప్సీ ఈ రేంజ్ లిప్‌లాక్‌లు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాలో అమ్మడు ఇంకేమైనా దాచిందా అని ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Leave a comment