సినీపరిశ్రమలో మరో విషాదం..కుళ్లిన డైరక్టర్ మృతదేహం..

13

ఈమధ్య చిత్ర పరిశ్రమలో విషాదాలు ఎక్కువయ్యాయి. ఈమధ్యనే సీనియర్ నటి ఇంట విషాదం చోటు చేసుకోగా ఇప్పుడు ఏకంగా ఓ దర్శకుడి మరణం అంతటా హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు మరణించడమే కాదు అతని శవం కుళ్లిపోవడం సిని పరిశ్రమను షాక్ అయ్యేలా చేసింది. కోలీవుడ్ దర్శకుడు సి. శివకుమార్ మంగళవారం చెన్నైలో సాలిగ్రామంలో శవంగా కనిపించారు.

ఆయన మృతదేహం కుళ్లి ఉండటంతో పోలీసులు సైతం షాక్ అయ్యారట. కోలీవుడ్ స్టార్ హీరోలు అర్జున్, అజిత్ ల సినిమాలను డైరెక్ట్ చేసిన శివ కుమార్ ఇలా చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన డెడ్ బాడీ కుళ్లిపోవడం కూడా కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది. దర్శకుడిగా మారక ముందు భాగ్యరాజ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు.

శివ కుమార్ మృతి పట్ల కోలీవుడ్ అంతా షాక్ అయ్యారు. అతని కుటుంబానికి సిని పరిశ్రమలు సానుభూతిని ప్రకటించారు. ఈ ఇయర్ దర్శక నిర్మాత ముక్తా శ్రీనివాసన్, సీవీ రాజేంద్రన్ లు మృతి చందగా ఇప్పుడు శివకుమార్ మరణం పట్ల ఇండస్ట్రీకి తీరని లోటుని మిగిల్చింది.

1

Leave a comment