తమిళ అర్జున్ రెడ్డికి సమస్యగా మారిన విక్రం..!

54

తెలుగులో సూపర్ హిట్ సినిమా అయిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందిలో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ ఈ రీమేక్ చేస్తుండగా తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటి సినిమానే ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు బాగానే ఉన్నా ధ్రువ్ అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ సినిమా బాలా డైరక్షన్ లో తెరకెక్కింది. ఆ రష్ చూశాక సినిమా మొత్తాన్ని స్క్రాబ్ లో పడేశారు.

ఇక ఇప్పుడు ఆ సినిమాను మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. ఈసారి అర్జున్ రెడ్డి సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరక్టర్ గిరీశయ్యను డైరెక్టర్ గా పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. టైటిల్ కూడా వర్మ అన్నదాన్ని మార్చి ఆదిత్య వర్మ అని పెట్టారు. అయితే ఈసారి కొడుకు సినిమా విషయంలో ఎలాంటి తప్పు జరుగకూడదు అని విక్రం బాగా ప్రయత్నిస్తున్నాడట. ప్రతి రోజు ఆదిత్య వర్మ షూటింగ్ స్పాట్ కు వెళ్తున్నాడట. అంతేకాదు చిత్రయూనిట్ డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుతుంటే అక్కడికి కూడా విక్రం వెళ్లి షూటింగ్ అబ్సర్వ్ చేస్తున్నారట.

అయితే ఇది దర్శక నిర్మాతలకు సమస్యగా మారిందని తెలుస్తుంది. కొడుకు మొదటి సినిమా హిట్టు కొట్టాలన్న తపన ఉండటం మంచిదే కాని మరి ఇంతగా ప్రతితోజు షూటింగ్ రావడం ఆయన సలహాలు ఇవ్వడంపై చిత్రయూనిట్ కాస్త అసంతృప్తిగా ఉందట. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆదిత్య వర్మ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment