Gossipsతమన్నాకు టెండర్‌ పెట్టిన బ్యూటీ

తమన్నాకు టెండర్‌ పెట్టిన బ్యూటీ

స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. తన ఇమేజ్‌కు సరిపడే సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎఫ్2, అభినేత్రి 2 సినిమాలు చేసిన తమన్నా మరో ఇంట్రెస్టింగ్ సినిమా సీక్వెల్‌కు ఓకే చేసింది. అయితే అమ్మడి ఆశలపై నీళ్లు జల్లుతూ ఆ సినిమా నుండి ఆమె వాకౌట్ చేయడం.. వేరే బ్యూటీ ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయింది.

యాంకర్ నుండి డైరెక్టర్‌గా మారిన ఓంకార్ ‘రాజు గారి గది’ సినిమా హిట్ కావడంతో రాజు గారి గది-2 తీసాడు. ఆ సినిమా కూడా హిట్ కావడంతో ఇప్పుడు రాజు గారి గది-3 సినిమాకు క్లాప్ కొట్టాడు ఈ డైరెక్టర్. ఇటీవల తమన్నా, అశ్విన్ బాబులపై క్లాప్ కొట్టిన ఈ సినిమా నుండి తమన్నా కొన్ని కారణాల వల్ల వాకౌట్ చేసింది. దీంతో ఈ సినిమాలో వెంటనే మరో హీరోయిన్ తాప్సీని సెలెక్ట్ చేశాడు ఓంకార్. తాను వాకౌట్ చేసిన సినిమాలో మరో బ్యూటీ వెంటనే సెలెక్ట్ కావడంతో తమన్నా షాక్‌కు గురైంది.

అటు తాప్సీ కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. తాను సెలెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తుండటంతో మరోసారి తెలుగులో తన మార్క్ వదిలేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఓంకార్ చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news