Moviesస్వీటీ అడ్డాలో మిల్కీ.. చూసినోడికి చూసినంత!

స్వీటీ అడ్డాలో మిల్కీ.. చూసినోడికి చూసినంత!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుంధతి తరువాత అంతటి పేరు తెచ్చిన సినిమా భాగమతి. బాహుబలి సినిమా తరువాత రిలీజ్ అయిన భాగమతి సినిమాలో అనుష్క పర్ఫార్మోన్స్‌కు జనాలు నీరాజనాలు పట్టారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన భాగమతి సినిమాలో అనుష్క పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు అనుష్క అడ్డాలో పాగా వేస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా.

ఇటీవల సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న తమన్నాకు భాగమతి డైరెక్టర్ అశోక్ ఓ కథ చెప్పినట్లు.. అది భాగమతికి రీమేక్ అని తెలుస్తోంది. భాగమతి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు తమన్నాతో దాని తమిళ రీమేక్ చేసేందుకు దర్శకుడు అశోక్ రెడీ అవుతున్నాడు. తమన్నా కూడా ఎప్పటినుంచో లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం వెయిట్ చేస్తోందట. ఇప్పుడు వచ్చిన ఈ ఛాన్సును ఎట్టిపరిస్థుతుల్లో వదులుకోదట.

మరి అనుష్క అడ్డాలో తమన్నా ఎలా పాగా వేస్తుందో చూడాలంటే సినిమా పూర్తయితేనే తెలుస్తోంది. అటు తమన్నా ప్రస్తుతం తన తదుపరి సినిమాలను రెడీ చేస్తోంది. అనుష్క చేసిన పాత్రను తమ్మూ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news