త‌మ‌న్నా ఇంత దిగ‌జారిపోయిందా…

41

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతోంది. ఇండ‌స్ట్రీలో చాలా సీనియ‌ర్ అయిన త‌మ‌న్నాకు ఇప్పుడు ఛాన్సులు రావ‌డం క‌ష్టంగానే ఉంది. సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 సినిమా చాలా రోజుల‌కు ఆమె ఖాతాలో ప‌డిన పెద్ద హిట్‌. ఇక అభినేత్రి 2 ఎప్పుడు వ‌చ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవ్వ‌రికి తెలియ‌దు. ఇలా ఊసు లేని సీక్వెల్ సీరిస్‌ల్లో న‌టిస్తూ కాలం గ‌డిపేస్తోంది.

ఇదిలా ఉంటే ఓంకార్ రాజుగారి గ‌దితో హిట్ కొట్టి రాజుగారి గది 2తో ఫ‌ట్ మ‌నిపించాడు. ఇప్పుడు మ‌నోడు మూడోపార్ట్‌కు రెడీ అవుతున్నాడు. లారెన్స్ కాంచన సిరీస్ మాదిరిగా ఓంకార్ ఈ సీరిస్‌ను ప‌ట్టుకుని వేళాడుతున్నాడు. ఇప్పుడు త‌మ‌న్నా ఈ మూడో పార్ట్‌లో హీరోయిన్‌గా చేస్తోంది.

ఛాన్సులు లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు త‌మ్మూ ఇలాంటి హ‌ర్ర‌ర్ సీరిస్ సినిమాల్లో బోల్డ్ టైప్ క్యారెక్ట‌ర్లు చేసుకునే స్థాయికి దిగ‌జారిపోయింద‌న్న టాక్ ఆమెపై వ‌చ్చేసింది. ఈ సినిమాలో త‌మ‌న్నా క్యారెక్ట‌ర్ బోల్డ్ టైప్ దెయ్యం త‌ర‌హాలో ఉంటుంద‌ట‌. ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా చేస్తున్నాడు. దీనిని ఓంకార్ త‌న సొంత బ్యాన‌ర్ మీదే తీస్తున్నాడు.

ఏదేమైనా త‌మ‌న్నా తోటి హీరోయిన్లు అనుష్క‌, న‌య‌న‌తార లాంటి వాళ్లు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేస్తుంటే త‌మ‌న్నా మాత్రం అవ‌కాశాల కోసం ఈ టైప్ సినిమాలు ఒప్పుకోవ‌డం ఆమె అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

Leave a comment