చిరుకి చుక్కలు చూపిస్తున్న వరుణ్..!

17

‘సైరా నరసింహ రెడ్డి’ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దక్షిణ భరత్ దేశం అంత ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న చిత్రం. అందుకు తగినట్టు గానే చిత్ర యూనిట్ ఈ సినిమాకి హైప్ తీసుకు రావటానికి సౌత్ లో స్టార్స్ అయినా సుదీప్, విజయ్ సేతుపతి మరియు బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసారు. ప్రస్తుతం ‘సైరా’ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ సుమారు 40 రోజుల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఇక్కడే చిత్ర యూనిట్ కి ఒక అనుకోని సమస్య వచ్చి పడింది, అది గత వారం రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉంది. దీనితో చేసేది ఏమి లేక మెగాస్టార్ మరియు మరి కొంత మంది నటులు షూటింగ్ స్పాట్ కి రావటం తర్వాత షూటింగ్ జరగటం కష్టం అని తెలియటంతో వారు నిరాశగా తిరిగి వెళ్లి పోతున్నారు. ఇలా అనుకోని అతిధిగా వచ్చిన వరుణుడు సైరా సినిమాకి కష్టాలు సృష్టిస్తున్నాడు. వరుణుడు ఇకనైనా కరుణిస్తాడో లేదో చూడాలి.

Leave a comment