Moviesసైరా ఇంటర్వల్ బ్యాంగ్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!

సైరా ఇంటర్వల్ బ్యాంగ్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచగా సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోతుందని తెలుస్తుంది. దాదాపుగా సినిమా మొత్తం 10 భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఆ సీన్స్ లో ఇంటర్వల్ భారీ యుద్ధం ఉంటుందట అది సినిమా మొత్తానికే హైలెట్ అని తెలుస్తుంది. ఆ సీన్ లో మెగా ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరని తెలుస్తుంది.

సైరా ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్తుందట. మెగాస్టార్ చిరంజీవి ఉగ్ర రూపం ఆ సీన్ లో చూస్తారట. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సైరా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news