‘ సైరా ‘ బిజినెస్ డీల్ అదిరిపోతోందిగా…

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్‌సైడ్ టాక్ ప్రకారం మొత్తం ఆరు ఏరియాలకు కలిపి ఆంధ్ర ప్రాంతం నుంచే రూ.60 కోట్లు నిర్మాత రామ్ చరణ్ ఆశిస్తున్నాడట. దీంతోపాటు తెలుగు సినిమా మార్కెట్ కీలకంగా ఉన్న సీడెడ్‌ నుంచి రూ. 25 కోట్ల దాకా అడిగినట్టు తెలుస్తోంది ఇక నైజం విషయానికి వస్తే ఇద్దరు అగ్ర నిర్మాతలు రైట్స్ కోసం పోటీ పడుతున్నారట. దీంతో 40 కోట్ల వరకు ఇక్కడ కోడ్‌ చేయవచ్చని అంటున్నారు. మరో మూడు నాలుగు కోట్లు నైజాంలో ఎక్కువ రేటు పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.

ఈ లెక్క‌న చూస్తే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 120 కోట్ల దాకా బిసినెస్ చేసినట్టు అవుతుంది. ఇక క‌న్న‌డ‌, త‌మిళ్‌, మ‌ళ‌యాళం, బాలీవుడ్ రైట్స్ వీటికి అద‌నం. ఓవ‌రాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ నుంచే మొత్తం పెట్టుబ‌డి వ‌చ్చేస్తుంది. ఇక శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ కూడా క‌లుపుకుంటే సైరా అదిరిపోయే బిజినెస్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అయితే సినిమా రేంజ్‌కు త‌గ్గ‌ట్టుగా ఇంకా ప్ర‌మోష‌న్స్‌, హ‌డావిడి అయితే లేదు. జులై నెలాఖరు నుంచి సైరా సందడిని మెల్లగా స్టార్ట్ చేస్తారట. క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Leave a comment