Gossips" సైరా నరసింహారెడ్డి " టీజర్ టాక్..!

” సైరా నరసింహారెడ్డి ” టీజర్ టాక్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్ మెగా ఫ్యాన్స్ నే కాదు సిని ప్రియులను అలరించేలా ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ యుద్ధం ఎవరిది అంటూ మెగాస్టార్ గంభీరంగా అనడం.. సురేందర్ రెడ్డి డైరక్షన్ టాలెంట్ సైరా టీజర్ ను సూపర్ అనేలా చేశాయి. సినిమా బడ్జెట్ కు తగిన న్యాయం జరుగుతుందని టీజర్ లో చూపించిన విజువల్స్ చూస్తే తెలుస్తుంది. టీజర్ చూస్తే సినిమా మరో సంచలనం అయ్యేలా కనిపిస్తుంది.

సినిమా టీజర్ లో మెగాస్టార్ లుక్స్ నిజంగానే అంచనాలను పెంచేసింది. సైరా టీజర్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుండగా సిని ప్రియులు కూడా సినిమా ఇంప్రెస్ అయ్యారు. ఓ రోజు ముందే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ సైరాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news