మెగాస్టార్ తమిళ సాహసం..?

23

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ తో వస్తున్న ఈ సినిమాతో చిరంజీవి మొదటిసారి తమిళ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇన్నేళ్ల కెరియర్ లో చిరు తమిళ సినిమాలు చేసింది లేదు.

అయితే సైరాతో మొదటిసారిగా తమిళంలో తన సత్తా చాటాలని చూస్తున్నారు. బాహుబలి పుణ్యమాని తెలుగు సినిమాలకు అక్కడ భారీ క్రేజ్ ఏర్పడింది. అందులో చిరంజీవి సినిమా కాబట్టి కచ్చితంగా అంచనాలు ఏర్పరుస్తుంది. సైరాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఉన్నాడు. అంతేకాదు అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబులు కూడా సైరాలో ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా నయనతార కూడా తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

అందుకే సైరా సినిమాను తెలుగుతో పాటుగా తమిళంలో కూడా డైరెక్ట్ సినిమాగా ప్రమోట్ చేస్తున్నారట. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచనలాను సృష్టిస్తుందో చూడాలి. ఖైది నంబర్ 150తో పదేళ్ల తర్వాత తన సత్తా చాటిన చిరంజీవి సైరాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైందని తెలుస్తుంది. అంచనాలు తారాస్థాయిలో ఉండటం వల్ల బిజినెస్ కూడా దానికి తగినట్టుగానే భారీగా జరుగుతుంది.

Leave a comment