సైరా లేటుకి ఆయనే కారణమా.. కెరియర్ లో ఎప్పుడులేదు కాని..!

sye-raa-narasimhareddy

ఖైది నంబర్ 150 సినిమాతో పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా తర్వాత తీస్తే చరిత్రలో నిలిచిపోయే సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ పై కన్నేశాడు. సైరా నరసింహారెడ్డి అంటూ సమరానికి సిద్ధమయ్యాడు.

దాదాపు 60 సంవత్సరాలు వయసు పైబడిన హీరో కాబట్టి చిరంజీవిలో ఇదవరకు ఉన్న చురుకుదనం కనిపించడం లేదట. సైరా షెడ్యూల్ షెడ్యూల్ కు ఎక్కువ గ్యాప్ ఇస్తున్నాడట చిరంజీవి. సైరాలో యాక్షన్ ఘట్టాలు ఉండటంతో ఈ ఏజ్ లో కాస్త రిస్క్ అవుతుందని తెలుస్తుంది. అందుకే సినిమా చాలా లేట్ అవుతుందట.

ఎలాగు సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి ఇబ్బంది లేదు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాని చిరు ఇచ్చే బ్రేకులు చూస్తుంటే సంక్రాంతికి కాదు సమ్మర్ దాకా వెళ్లినా వెళ్లొచ్చని అంటున్నారు.

Leave a comment