‘సైరా’.. నై నై రా !

sye-raa-narasimha-reddy

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నచిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం మీద అప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 1857 తిరుగుబాటుకి ముందే బ్రిటిష్‌కి వ్యతిరేకంగా పోరాడిన తెలుగు యోధుడి చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో.. జనాల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. అందుకే..ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు జనాలు.

ప్రారంభోత్సవం జరిగి చాలాకాలం అవుతున్నా ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లడంలేదు. అదిగో స్టార్ట్ అయిపోతుంది.. ఇదిగో స్టార్ట్ అయిపోతుందని చెప్పుకొస్తున్నారే తప్ప పనులు మాత్రం జరగడంలేదు.

ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్ ఓవైపు తన ‘రంగస్థలం’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు ‘సైరా’ ప్రీ-ప్రొడక్షన్‌లపై దృష్టి సారించినా.. పనులు మాత్రం ముందుకు కదలడంలేదు. ఇలా ఆలస్యం అవుతుండడం వల్లే యూనిట్‌లో గందరగోళ వాతావరణం నెలకొందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరూ చాలా పాపులారిటీ కలిగినవారు. ఈ మూవీతోపాటు ఇతర ప్రాజెక్టుల్ని కూడా ఒప్పుకున్నారు. ‘సైరా’ వాయిదా పడుతున్నప్పటికీ కొంతకాలం వేచి చుసిన టెక్నీషియన్స్ మెల్లగా ఒక్కొక్కరూ జారుకుంటూ వస్తున్నారు.ఇంతకు ముందే ఇదే కారణంతో కెమెరామెన్, ఆ తర్వాత ఏఆర్ రెహహాన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు ఇతర టెక్నీషియన్స్ సైతం బయటికి వచ్చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసి చెర్రీ కొన్నిరోజుల వరకు మేనేజ్ చేయగలిగాడని, కానీ పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో వాళ్లు బయటికొచ్చేయాలని నిర్ణయించేసుకున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తని బయటకు రానివ్వకుండా చిత్ర యూనిట్  జాగ్రత్తలు తీసుకుంటోంది. టెక్నీషియన్స్ ఇలా వెళ్లిపోవడంతో చిత్రంపై నెగెటివ్ ప్రచారం వస్తుందని వారి ఉద్దేశం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీద్దామంటే ఆదిలోనే హంసపాదు ఎదురయ్యిందని మెగా ఫ్యామిలి డీలాపడిపోతోంది.

 

Leave a comment