” సూర్యకాంతం ” ట్రైలర్.. ఫైర్ బ్రాండ్ సూర్యకాంతం..!

115

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా వస్తున్న సినిమా సూర్యకాంతం. ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ కు తగినట్టుగానే సినిమా వస్తుందనిపిస్తుంది. సూర్యకాంతం గా నిహారిక ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తుంది.

బుద్దుగా కనిపించే హీరోతో ప్రేమలో పడుతుంది. ఇంతలో హీరో పూజా అనే అమ్మాయిని ఇష్టపడతాడు. తనని ఇష్టపడే కాంతం.. తను ఇష్టపడే పూజా ఈ ఇద్దరిలో చివరకు అతను ఎవరిని యాక్సెప్ట్ చేశాడు అన్నది సినిమా కథ. సూర్యకాంతం సినిమా ట్రైలర్ చూశాక సినిమా అంతా సరదాగా ఉంటుందనిపిస్తుంది. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో దర్శకుడిగా ప్రతిభ చాటిన ప్రణీత్ ఈసారి ఫీచర్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల ఫలితాలు నిరాశపరచినా నిహారిక సూర్యకాంతం సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉంది. మరి ఈ సినిమా అయినా నిహారికకు మంచి హిట్టు అందిస్తుందో లేదో చూడాలి.

Leave a comment