టాలీవుడ్ కమెడియన్ అరెస్ట్.. టాలీవుడ్ లో కలకలం..

35

సంచలనం రేపిన ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట ఈ కేసును ఆంధ్ర పోలీసులు విచారణ చేపట్టారు. తర్వాత ఆ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయ్యింది. తర్వాత ఆ కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయ్యింది. అలాగే, కేసుతో సంబంధం ఉన్నవారికి ఉచ్చు బిగుస్తున్నారు. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ నటుడు సూర్య పింగ్ పంగ్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతన్ని బంజారా హిల్స్ పోలీసులు విచారణ జరిపారు. ‘ఆ నలుగురు’ సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమారుడిగా సూర్య ప్రసాద్ నటించాడు.
1
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి, సూర్యలు మంచి స్నేహితులు కావడం..పలుమార్లు వీరి మద్య సంభాషనలు జరగడం పోలీసుల ఎంక్వేయిరీలో తేలింది. నిన్న రాత్రంతా సూర్య ప్రసాద్ ను విచారించిన హైదరాబాద్ పోలీసులు, తెల్లవారుజామున 4 గంటలకు అతన్ని వదిలిపెట్టారు. ఆపై మీడియాతో మాట్లాడిన సూర్య, ఈ కేసులో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారని, అందులో భాగంగానే తననూ పిలిపించారని అన్నాడు.

విచారణ అనంతరం సూర్య మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవాలని..లేడీ వాయిస్ తో జయరామ్ ని తాను పిలిచినట్లు కొన్ని వార్తలు తనపై వస్తున్నాయని..వాటిలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. కాగా, జయరామ్ ను తన ఇంటికి పిలిపించేందుకు ఓ అమ్మాయి పేరిట ఆయన్ను ట్రాప్ చేసినట్టు పోలీసులు తేల్చారన్న సంగతి తెలిసిందే. అమ్మాయి గొంతుతో జయరామ్ కు ఫోన్ చేయించిన తరువాతే, ఆమెను కలవాలన్న ఆశతో వచ్చిన జయరామ్ ను నిర్బంధించి హత్య చేశారు.

Leave a comment