Gossipsఇండస్ట్రీ లో డ్రగ్ మాఫియా ని బయటపెట్టిన సురేష్ బాబు

ఇండస్ట్రీ లో డ్రగ్ మాఫియా ని బయటపెట్టిన సురేష్ బాబు

సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నవారిని నియంత్రించడం అంత సులభం కాదని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ప్రతిభ ఉన్నవారందరికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలపై ఇప్పటికే కమిటీ వేశామని తెలిపారు. ఆ మద్య టాలీవుడ్ లో డ్రక్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకోకపోతే పనిచేయలేని బ్యాచ్ కూడా ఉందని బాంబు పేల్చాడు.

“డ్రగ్స్ తీసుకున్న వాళ్లను సినిమాల్లోకి తీసుకోకూడదనే రూల్ పెట్టగలం. కానీ యూనిట్ అంతా డ్రగ్స్ తీసుకుంటే ఎలా? అలాంటి గ్రూపులు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. కథలు రాయడానికి డ్రగ్స్ తీసుకుంటారు. మ్యూజిక్ కంపోజ్ చేయడానికి డ్రగ్స్ తీసుకునే వాళ్లున్నారు. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారని అన్నారు. అయితే డ్రగ్స్ తీసుకోవడం ఈ మద్య కామన్ అయ్యింది..దానికి అడిక్ట్ అయిన వారు సెలబ్రెటీలు కావడం దారుణమైన విషయం అని అన్నారు.

పేరుకు వాళ్లు చాలా ప్రముఖ వ్యక్తులు. కానీ డ్రగ్స్ తీసుకోకుండా పనిచేయలేరు, వాళ్ల బుర్ర పనిచేయదు. అలాంటి వాళ్లు చాలామంది తనకు తెలుసని కుండబద్దలుకొట్టారు సురేష్ బాబు. ఇక క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలపై ఇప్పటికే కమిటీ వేశామని తెలిపారు. ఎక్కడ ఏది జరిగినా దానికి సినీపరిశ్రమనే భాధ్యురాలిగా చేయడం దారుణమని అన్నారు. ఎక్కడో అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడినా… దానికి, టాలీవుడ్ కు లింక్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని అన్నారు. డ్రగ్స్ వాడకూడదనే రూల్ పెడితే, ఇలాంటి ప్రముఖులు తప్పించుకుంటారని, వీళ్లను వదిలేసి, అంతగా పాపులర్ కాని వ్యక్తులపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఓపెన్ గానే నిజం ఒప్పుకున్నాడు.. డ్రగ్స్ వివాదాన్ని, ఇండస్ట్రీని కలిపి చూడకూడదంటారు సురేష్ బాబు. డ్రగ్స్ తీసుకోవడం అనేవి వ్యక్తిగత విషయాలని, వాటిని పరిశ్రమతో ముడిపెట్టడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news