టాలీవుడ్ లో విషాదం.. సురేష్ హఠాన్మరణం ..!

47

టివిలో యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి ఇంట విషాదం అలముకుంది. ఆమె బహ్ర్త సురేష్ తేజ తుది శ్వాస విడిచారు. సురేష్ తేజ కూడా బుల్లితెర షోలను డైరెక్ట్ చేస్తుంటారు. మా టాకీస్, మొగుడ్స్ పెళ్లాంస్ లాంటి షోలలో సురేఖా వాణి టాలెంట్ చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సురేష్ తేజ. బుల్లితెర మీద యాంకర్ గా కెరియర్ ఆపేసి సినిమాల్లో ప్రయత్నించిన సురేఖా వాణి అక్కడ అసక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు ఆమె ఇంట ఘోరం జరిగింది. సురేఖ వాణి భర్త మరణ వార్త విని తెలుగు పరిశ్రమలోని కొందరు ప్రముఖులు వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. సినిమల్లో తల్లి, అక్క, వదిన, అత్త పాత్రలు వేస్తూ ఎంచక్కా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సురేఖా వాణికి ఇంత కష్టం వచ్చిందే అని అందరు బాధపడుతున్నారు. అయితే సురేష్ తేజ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారట. అందుకే ఆయన అకాల మరణం చెందారని అంటున్నారు.
1

Leave a comment