సమ్మర్లో స్టార్ వార్.. గెలిచేదెవరో..!

summer win heros

ఇప్పటిదాకా 2018 సంక్రాంతికే స్టార్ వార్ జరుగుతుందని అనుకున్నాం కాని ఈసారి సమ్మర్ లో కూడా స్టార్ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. సమ్మర్ వేడి మరింత పెంచేలా వీరి సినిమాల పోటీ ఉండబోతుంది. గత కొన్నేళ్లుగా సమ్మర్ లో సూపర్ హిట్లు అందుకున్న బన్ని ఈసారి సమ్మర్ ను టార్గెట్ చేయగా.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో కూడా సమ్మర్ రిలీజ్ కు సిద్ధమవుతుంది.

ఇక వీరిద్దరే కాకుండా సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు మహేష్. కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సమ్మర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. చూస్తుంటే ఈసార్ సమ్మర్ లో కూడా సినిమా సందడి బాగానే ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ ముగ్గురిలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర విజయ పతాకం ఎగురవేస్తారు అన్నది చూడాలి.

 

Leave a comment