Gossipsయాంకర్ సుమ చాలా కాస్ట్ లీ గురూ..!

యాంకర్ సుమ చాలా కాస్ట్ లీ గురూ..!

తెలుగు యాంకర్స్ లలో స్టార్ సినిమా నుండి చిన్న సినిమా వరకు ఈవెంట్ ఏదైనా సినిమా ఫంక్షన్ అనగానే అందరికి గుర్తొచ్చే యాంకర్ సుమ. ఎన్నో ఏళ్లుగా ఎవరెవరో వస్తున్నా పోతున్నా సుమ మాత్రం యాంకరింగ్ చేస్తూనే ఉంది.. ఉంటుంది. అయితే ఈమధ్య ఆమె చాలా కాస్ట్ లీ అయ్యిందని తెలుస్తుంది.

ఈవెంట్ ఏదైనా సరే సుమ రావాలి అంటే 2 లక్షలు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే అంట. గంట ప్రోగ్రాంకు అంత అవసరమా అనుకున్న వారు సుమతో కాకుండా వేరే వాళ్లతో కానిచ్చేస్తున్నారు. అయితే ఎలాగు 2 లక్షలు తీసుకుంటుంది కదా అని ఈవెంట్ 3 గంటల పాటు ఆమెను తీసుకుంటున్న వారు ఉన్నారు. స్టార్ సినిమాలకు సుమ యాంకరింగ్ తప్పనిసరి అయ్యింది.

అయితే ఈమధ్య ఆమెను కాదని వేరే వాళ్లని తీసుకుంటున్నారు. రీసెంట్ గా కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ 2 లక్షలు అడుగగా ఆమెను కాదని ఝాన్సీని తీసుకున్నారు. సుమ కాకుంటే ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్ ఝాన్సీనే. ఆ తర్వాత అనసూయ లాంటి వారు వస్తారు. మరి పెంచిన పారితోషికం అవకాశాలను మిస్ చేస్తుంది అంటే మరోసారి ఆలోచించుకుంటే బెటర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news