అర్ధరాత్రి అక్సా ఖాన్ ఇంట్లో సుడిగాలి సుధీర్..!

aksha-khan-sudigali-sudheer

బుల్లితెర మీద సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ అందరికి సుపరిచితుడే. జబర్దస్త్ షోతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న సుధీర్ ఢీ జోడి, ఢీ 10 షోలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఢీ 10లో అక్సా ఖాన్ పై సుధీర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. షో జరుగుతున్న క్రమంలో ఆమెతో మాట్లాడటమే కాదు ఏకంగా అర్ధరాత్రి ఆమె ఇంటికెళ్లి మరి హంగామా చేశాడట.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే.. ఢీ 10లో దుమ్మురేపే కంటెస్టంట్స్ లో అక్సా ఖాన్ ఒకరు. ఆమె అంద చందాలతో పాటుగా డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. జడ్జ్ గా ఉన్న శేఖర్ మాస్టర్ చాలా సార్లు ఆమె పర్ఫార్మెన్స్ గురించి పొగిడారు. ఇక ఈమధ్య నాని గెస్ట్ గా రాగా ఆ ఎపిసోడ్ లో అక్సా ఖాన్ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యాడు. తను చేసే సినిమా డ్యాన్స్ ప్రధానంగా ఉంటుందని అందుకో ఓ లేడీ డ్యాన్సర్ గురించి చూస్తున్నామని తన దర్శకుడికి అక్సాని ప్రమోట్ చేస్తానని చెప్పాడు నాని.

ఢీ షో నుండి డైరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ అవకాశాన్ని అందుకున్న అక్సా ఖాన్ కు సుధీర్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడట. అంతేకాదు స్పెషల్ విశెష్ అందించేందుకు ఆమె ఇంటికెళ్లి మరి ఆమెను మెచ్చుకున్నాడట. సాయి పల్లవి తర్వాత ఢీ నుండి హీరోయిన్ గా మారుతున్న అక్సా ఖాన్ కెరియర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాడు సుధీర్.

Leave a comment