శంకరా.. మజాకా.. ‘2.0’లో అక్షయ్ వేషం వెనుక దాగివున్న రహస్యం ఇదే!

story behind akshay kumar getup in robo 2Point0

When ‘2.0’ first look posters released, everyone discussed about Akshay Kumar getup which looklike a bird. From then started to investigate what is secret behind this look. Finally, an interesting topic has revealed on Akki’s poster. Read below article to know more details.

శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’కి సంబంధించి ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే. తొలుత.. రజనీని హైలైట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తారని, ఈసారి ఆయన గెటప్ ఎలా ఉంటుందోనని అంతా వెయిట్ చేశారు. కానీ.. శంకర్ మాత్రం అందరి అంచనాలను తిప్పికొడుతూ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ లుక్‌ని రివీల్ చేశాడు. ఆ తర్వాత రజనీ లుక్‌ని కూడా విడుదల చేశాడు కానీ.. అక్షయ్ లుక్కే హైలైట్ అయ్యింది. ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరూ చూడని విధంగా అక్షయ్ రూపం ఉండడంతో.. అది అందరినీ ఆకర్షించింది.

అంతేకాదు.. ఆ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ‘అక్షయ్ గెటప్ అలా ఎందుకుంది? దాని వెనుక దాగివున్న రహస్యం ఏంటి?’ అనే ప్రశ్నలు అందరినీ కలచివేస్తున్నాయి. ఎలాగోలా ఆ వివరాలని రాబట్టాలని ఆరాతీయగా.. చివరికి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అక్షయ్ గెటప్ వెనుక అసలు స్టోరీ ఏంటో రివీల్ అయ్యింది. యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో అక్షయ్ కుమార్ పక్షుల మీద పరిశోధన చేసే సైంటిస్ట్ అట. బర్డ్ లవర్ అయిన అతడు.. వాటిమీద రకరకాల పరీక్షలు చేస్తాడట. ఈ క్రమంలోనే ఓ పరిశోధన వికటించి.. అక్షయ్ కుమార్ ‘పక్షి’గా మారుతాడని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్రకి సంబంధించిన ప్రతి సన్నివేశంలోనూ వందలాదిగా పక్షులు కనిపిస్తాయట. ప్రస్తుతం చెన్నై శివార్లలో ఈ పాత్రకోసం ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించి.. వందలాది పక్షుల మధ్య అక్షయ్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట శంకర్. ఇందుకోసం.. విదేశాల నుంచి రకరకాల పక్షుల్ని కూడా తెప్పించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటిస్తోంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంపై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొనడాన్ని బట్టి చూస్తుంటే.. ఇది ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a comment