Gossips‘శాతకర్ణి’ సినిమా అదరహో.. ప్రశంసలు కురిపించిన టాప్ డైరెక్టర్.. కానీ!

‘శాతకర్ణి’ సినిమా అదరహో.. ప్రశంసలు కురిపించిన టాప్ డైరెక్టర్.. కానీ!

A Telugu star director recently watches Gautamiputra Satakarni movie where it is completing post production works in Mumbai. He praised director for taking this huge film in low budget within 79 days of span. He also gave same suggestions to change some weak points.

ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. తమ తోటి దర్శకులతోపాటు దిగ్గజాల సహకారం కూడా తీసుకుంటారు. తాము రూపొందించిన చిత్రం ఎలా ఉంది? అందులో ఏవైనా తప్పులు దొర్లాయా? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం ముందుగానే వారికి సినిమా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కూడా అదే పని చేశాడు. బాలయ్య ప్రెస్టీజియస్ 100వ ప్రాజెక్ట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 79 రోజుల్లోనే ముగించిన క్రిష్.. ఓ టాప్ డైరెక్టర్‌ని సినిమా చూపించాడట. సినిమా చూశాక ఇందులో ఉన్న ప్లస్‌తోపాటు కొన్ని లోపాల్ని సైతం వెతికి చెప్పాడట.

ముంబయిలో ‘శాతకర్ణి’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న చోటికి వెళ్లి ఆ స్టార్ డైరెక్టర్ సినిమా చూశాడట. ఆయన్ని సినిమా బాగా ఆకట్టుకుందని సమాచారం. ఇంత తక్కువ బడ్జెట్‌లోనే గొప్ప క్వాలిటీతో అంత భారీ సినిమాను పూర్తి చేయడంపై ఆ దర్శకుడు ఆశ్చర్యపోయాడట. శాతకర్ణి పాత్రను తీర్చిదిద్దిన తీరుకూ ముగ్ధడైన అతను.. బాలయ్య సహా నటీనటులందరి అభినయం కూడా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడట. ఇక ఇదే సమయంలో ఈ చిత్రంలో ఉన్న కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి.. వాటి కరెక్షన్లు చెప్పాడట. దీంతో.. క్రిష్ ఆ పనిలో నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. విడుదలకు చాలా సమయం ఉండటంతో.. ఆలోపు మార్పులు చేర్పులు చేయడంతోపాటు మిగిలిన పనులు పూర్తి చేయవచ్చునన్న ధీమాలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ట్రైలర్‌ని ఈనెల 16వ తేదీన 100 థియేటర్లలో భారీఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో వేడుకని ఈనెలలోనే 26న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ ప్రశంసలు కురిపించడంతో.. దీనికి మరింత క్రేజ్ దక్కింది. చూడబోతే.. ఈ చిత్రం గత రికార్డుల్ని తుడిచిపెట్టేస్తూ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news