ఆగమైపోయిన అరవమేళం.. ఎన్టీఆర్ డాన్స్ కి ఇక థియేటర్లు పగిలిపోవాల్సిందే !!

ntr-new-movie

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఆగమైపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ 28వ చిత్రంపై పడింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో.. ఈసారి ఆయన ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తాడా? అని క్యూరియాసిటీ నెలకొంది. ఇలా అందరూ ఈ చిత్రం కాన్సెప్ట్ మీదే ధ్యాస పెడితే.. ఇంకోవైపు దీనిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమధ్య ఈ మూవీ ఆగిపోవచ్చని ప్రచారం కూడా తీవ్రంగా జరిగింది. చివరికి అవన్నీ రూమర్లేనని తేలిపోయింది.

అయితే.. లేటెస్ట్‌గా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు అనిరుధ్ తప్పుకున్నాడని ఆ వార్త సారాంశం. ఇందుకు కారణాలేంటో పక్కాగా తెలియరాలేదు కానీ.. అతను తప్పుకున్నది మాత్రం వాస్తవమని తేలింది. ఇదేదో చిన్నాచితకా వెబ్‌సైట్ రాసిన న్యూస్ కాదు.. బాగానే పేరుమోసిన ప్రధాన మీడియా సంస్థలే వెల్లడించాయి. అతని స్థానంలో ఎస్ఎస్ థమన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలిసింది. బహుశా అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణం ‘అజ్ఞాతవాసి’ రిజల్టే అయి వుండొచ్చని తెలుస్తోంది.

అయితే.. తారకే అతడ్ని తొలగించాల్సిందిగా త్రివిక్రమ్‌కి సూచించినట్లు వార్తలొస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’కి గొప్పగా సంగీతం ఇవ్వలేదని, అందుకే అతడ్ని మార్చమని తారక్ కోరినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. అనిరుధ్ పక్కకు తప్పుకున్నది మాత్రం వాస్తవం. థమన్ ఈమధ్య ఫుల్ పామ్‌లో ఉన్నాడు కాబట్టి, అతడ్ని ఈ మూవీకి బ్రహ్మాండమైన సంగీతం అందిస్తాడని ఆశించొచ్చు.

Leave a comment