శృతి రహస్య పెళ్లి… అసలేం జరిగింది..?

sruthihasan

గత కొద్దిరోజుల నుంచి తరుచూ శృతిహాసన్ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ వార్తలు సినిమాల గురించి మాత్రం కాదు ఆమె పర్సనల్ లైఫ్ గురించి … ఆమె ప్రేమ వ్యవహారం ఇంటా బయటా హాట్ టాఫిక్ గా మారింది. కొద్దీ రోజుల క్రితం ఆమె బాయ్ ఫ్రెండ్ కి సంబంధించి ఆసక్తికర విశేషాలు బయటపడ్డాయి. తల్లి సారికతో శృతి, ఆమె ప్రియుడు ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. తాజాగా మరో వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. అదేంటంటే… కొన్ని రోజుల క్రితం ఆమె తన విదేశీ ప్రియుడిని సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.1 2

శృతి హాసన్ కొన్ని రోజులుగా లండన్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ మిచేల్ కోర్సల్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అతడు ఇటీవల వచ్చి కొన్ని రోజులు శృతి హాసన్ తో గడిపి వెళ్లాడు. ఇద్దరూ డేటింగులో ఉన్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని రోజుల క్రితమే వీరు ఇద్దరూ ఇటలీలో రహస్య వివాహం చేసుకున్నారని, అందుకే శృతి హాసన్ తరచూ ఇటలీకి, ఇండియాకి ప్రయాణాలు చేస్తోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.3 4

అయితే శృతి పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచడానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయట. పెళ్లయినట్టు తెలిస్తే .. సినిమా ఆఫర్స్ తగ్గుతాయని, అందుకే ఈ విషయం బయటపడకుండా శృతి జాగరత్తపడుతోందంట.
అయితే ఈ విషయాన్నీ మాత్రం శృతి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. శృతికి అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, ఏమి చేసినా ధైర్యంగా అందరికి చెప్పే చేస్తుందని వారు చెప్తున్నారు. అయితే శృతి హాసన్ పెళ్లిపై ఎన్ని పుకార్లు షికార్లు చేసినా సరే ఆమె మాత్రం ఎక్కడా నోరు మెదపడంలేదు.kamal hasan

Leave a comment