Gossipsలైంగిక వేధింపులు చేశాడంటూ స్టార్ హీరో పై శృతి కామెంట్స్..

లైంగిక వేధింపులు చేశాడంటూ స్టార్ హీరో పై శృతి కామెంట్స్..

కోలీవుడ్ లోనూ మీ టూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శృతి హరిహరన్ ఆరోపణలు గుప్పించింది.

నిబునన్’ చిత్రీకరణ సమయంలో తనను అర్జున్ హత్తుకున్నాడని శృతి ఆరోపించింది. ఓ రొమాంటిక్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా… చేతులను తన వీపుపై ఉంచి గట్టిగా హత్తుకుని, ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడని , నా అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం దారుణమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే దీనిపై అర్జున్ కూడా స్పందించాడు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన నటి శృతిహరిహరన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని అర్జున్ స్పష్టం చేశారు.
2
నాకు ఓ కూతురు ఉంది. ఆమె కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. నటించడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి సమయంలో నేను మరో మహిళతో ఎలా అసభ్యంగా బిహేవ్ చేస్తాను. మీ టూ ఉద్యమం రావడం మంచిదే. కానీ దానిని తప్పుదారి పట్టించకూడదు అని అర్జున్ సూచించాడు.

అయితే అర్జున్ స్పందన తరువాత ఈ అంశంపై మరోసారి ఆమె విరుచుకుపడింది. అర్జున్ చెప్తున్నవన్నీ అబద్ధాలని, ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పింది. అంతే కాదు నేను ఈ అంశం బయటపెట్టిన దగ్గర నుంచి అర్జున్ అభిమానుల నుండి తనకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఇలాంటివన్నీ ఎదురవుతాయని ముందుగానే ఉహించానని తెలిపింది. అంతేకాదు ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్‌గా రాణించే హీరోలే ఎక్కువగా లైంగిక వేధింపులకు పాల్పడతారని కాకపోతే వారికి ఉన్న పలుకుబడి కారణంగా వారి వ్యవహారంపై మాట్లాడేందుకు పెద్దగా ఎవరూ ముందుకురారని శృతి హరిహరన్ ఘాటుగా స్పందించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news