” శ్రీనివాస కళ్యాణం ” ట్రైలర్

7

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి తర్వాత సతీష్ వేగేశ్న డైరక్షన్ లో అదే రేంజ్ అంచనాలతో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే పండుగ అంటూ జయసుధ చెప్పిన మాటలానే సినిమా మొత్తం పెళ్లి దాని విశిష్టతను చెప్పేలా కనబడుతుంది.

ముఖ్యంగా ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ ప్లస్ అవనుందని తెలుస్తుంది. దిల్ రాజు ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ నెల 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది ఇక చూస్తుంటే సినిమా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. నితిన్ కెరియర్ ఈ సినిమా ఫలితం అతని ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది. లీడ్ పెయిర్స్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది.

Leave a comment