Moviesశ్రీనివాస కళ్యాణం టీజర్.. అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దొస్తారు..!

శ్రీనివాస కళ్యాణం టీజర్.. అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దొస్తారు..!

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి సినిమా తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నితిన్ సరసన రాషి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

థీం టీజర్ లో పెళ్లి ప్రాముఖ్యత గురించి చెప్పగా.. ఈ టీజర్ లో హీరో, హీరోయిన్ మధ్య పరిచయం, ప్రేమ గురించి చూపించారు. టీజర్ ఇంప్రెసివ్ గా ఉండగా ఆగష్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా.. అమ్మాయిలకు అబ్బాయిలు ముద్దొస్తారని డైలాగ్ యూత్ ను ఆకట్టుకుంటుంది.

లై, ఛల్ మోహన్ రంగ ఫెయిల్యూర్స్ తర్వాత నితిన్ చేస్తున్న శ్రీనివాస కళ్యణం మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి నితిన్ కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news