డబ్బు కోసమే శ్రీదేవిని చంపేశారా..!దుబాయ్ లోనే చావడం వెనుక దాగిన భయంకరమైన నిజం

sri-devi-death-mystery

ఇటీవల ఇండియన్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. బాత్ టబ్ లో పడి ఆమె మృతి చెందిన వార్త సంచలనంగా మారింది. రెండు రోజుల తర్వాత డెడ్ బాడీని ఇండియాకు పంపించారు. శ్రీదేవి మరణం పట్ల ఎవరికి అంతుచిక్కని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆమె మరణం ఓ మిస్టరీగానే ఉంది.

ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ నిర్మాత సునీల్ సింగ్ కేవలం శ్రీదేవి మీద ఉన్న 240 కోట్ల భీమా కోసమే ఆమెను కావాలని చంపినట్టు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. శ్రీదేవి పేరిట ఒమన్ లో 240 కోట్ల భీమా ఉందని. దుబాయ్ లో మరణిస్తేనే అవి వస్తాయని అందుకే ఆమెను దుబాయ్ లో హత్య చేశారన్నట్టు ఆమె పిటీషన్ లో పేర్కొన్నాడు.

ఇప్పుడు ఈ పిటీషన్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే సుప్రీం మాత్రం సునీల్ సింగ్ పిటీషన్ ను కొట్టివేసింది. ఇదవరకే ఈ కేసు పట్ల తమ తీర్పు చెప్పామని.. మళ్లీ ఇలాంటి కేసులు తీసుకోబోమని అన్నారట. కేవలం 240 కోట్ల భీమా కోసం శ్రీదేవిని చంపుతారా అన్న కోణంలో ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.

Leave a comment