విశాల్‌పై బూతులతో గర్జించిన శ్రీరెడ్డి….

27

కాస్టింగ్ కౌచ్ ఉదంతం తర్వాత శ్రీరెడ్డి సౌత్ ఇండియన్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈ విషయంలో శ్రీ రెడ్డి లైంగిక వేధింపుల్లో టాప్‌ సెలబ్రిటీల పేర్లు బయటకు తీస్తూ గత ఏడాది కాలంగా ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. రెండేళ్ల క్రితం వరకు శ్రీరెడ్డి అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు శ్రీరెడ్డి అంటే బాబోయ్ అనుకునేంత పాపులర్ రేంజ్ కు ఆమె వెళ్లిపోయింది. ఇక తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేయడంతో పాటు… ఫేస్ బుక్ లైవ్ లో నెటిజ‌న్లు వేసే ఎన్నో ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్‌గా సమాధానం ఇస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

శ్రీరెడ్డి దెబ్బకు ఎంతో మంది తెలుగు స్టార్ హీరోలు సైతం షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా నేచురల్ స్టార్ నానీపై కూడా శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక తెలుగువాడైనా కోలీవుడ్లో హీరోగా ఉన్న విశాల్‌ను గతంలోనే టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు విశాల్‌పై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా విశాల్ ను ఆమె కనీసం వినటానికి… రాయడానికి వీలులేని భాషలో బండ బూతులు తిట్టింది. విశాల్ హీరోయిన్స్ తో కమిట్ మెంట్ లేకుండా అసలు సినిమాలే చేయడ‌ని చెప్పుకొచ్చింది.

గతంలో విశాల్ ఒక హీరోయిన్ ను బలవంతంగా అనుభవించి ఆ తర్వాత ఆమెకు అదనపు పారితోషికం ముట్టజెప్పాడ‌ని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక విశాల్ కేరోవేన్‌కు అమ్మాయిలను సప్లై చేసే వ్యక్తి తనకు తెలుస‌న్న‌ శ్రీ రెడ్డి అతడి వల్ల నాశనమైన ముగ్గురు బాధితులు కూడా తనకు తెలుసని చెప్పింది. విశాల్ తన జోలికి వస్తే తాను కాళీమాత అవతారమెత్తి అతడి అంతు చూస్తానని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏదేమైనా కోలీవుడ్లో అందరివాడుగా పేరు తెచ్చుకున్న విషయాలను శ్రీరెడ్డి టార్గెట్ చేయడంతో విశాల్ అభిమానులతో పాటు… కోలీవుడ్ అభిమానులు శ్రీరెడ్డి పై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. మరి ఈ కౌంటర్లపై శ్రీరెడ్డి తిరిగి ఎలా రిటాక్ట్‌ ఇస్తుందో ? చూడాలి.

Leave a comment