మూవీ ట్రైలర్స్ తో పోటీపడుతున్న శ్రీ లీక్స్…

sree-leaks

.”శ్రీ రెడ్డి” ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇదే హాట్ టాపిక్. కొంత కాలంగా సినీ పరిశ్రమ లోని పెద్దలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య శ్రీ రెడ్డి లీక్స్. పరిశ్రమలోని కొంత మంది బడా బాబులు తనకి హీరోయిన్ గ అవకాశాలు ఇస్తానని చెప్పి తనని శారీరకంగా వాడుకుని మోసం చేసారు అని శ్రీ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

శ్రీ రెడ్డి ప్రముఖ నిర్మాత మరియు రామానాయుడు స్టూడియోస్ అధినేత డీ సురేష్ బాబు తనయుడు అభిరాం తనని రామానాయుడు స్టూడియో లో లై౦గికంగా లోబర్చుకున్నాడు అని ఆరోపించింది. దీనికి తన వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూ అభిరాం తో చేసిన వాట్సాప్ సంభాషణలు మరియు అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలని సోషల్ మీడియా మరియు పలు న్యూస్ చానెల్స్ కి అందచేసింది.
ఈ సంఘటన పై సురేష్ బాబు తనకి సమాధానం చెప్పాలని, తన రెండవ కుమారుడి పై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీ రెడ్డి నిరసన తెలియ చేసింది. నిర్మాత సురేష్ బాబు ఈ సంఘటన పై ఎ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
తాజాగా శ్రీ రెడ్డి, అభిరాం( సురేష్ బాబు కుమారుడు) తో క్లోజ్ గా ఉన్న ఒక వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తుంది, ఈ వీడియో స్టార్ హీరో సినిమా ట్రైలర్స్ కి ధీటుగా సుమారు 3.2 M వ్యూస్ ని దక్కించుకుంది.

Leave a comment