Gossipsశ్రీముఖి ఆ కమెడియన్ ని లవ్ చేస్తోందా ..? 

శ్రీముఖి ఆ కమెడియన్ ని లవ్ చేస్తోందా ..? 

టాప్ కమెడియన్ గా తెలుగు ఇండ్రస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెన్నెల కిషోర్  ఇప్పుడు మీడియాలోకి ఎక్కాడు. ఎందుకో తెలుసా..?  కిశోర్ తన ట్విట్టర్ ఖాతాలో తన ఫోటో పెట్టి దానికి క్యాప్షన్ గా .. “మై కరేబియన్.. మై కామారెడ్డి” అంటూ పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలో వెన్నెల కిశోర్ ఒక మామిడితోటలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సరదాగా నవ్వుతూ ఉన్నారు.. ఈ ఫోటో చూసినవాళ్లంతా మాది కూడా కామారెడ్డి అంటూ రిప్లై లు ఇస్తున్నారు.. ఇంతలో టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా రిప్లై ఇచ్చింది..

“ఐ లవ్ యూ! నా కీపాడ్ నీ ట్వీట్స్‌ ని చూసినప్పుడు..ఈ పదాలు మాత్రమే టైప్ చేస్తున్నాయి!” అంటూ ట్వీట్ చేసింది.. దీనికి వెన్నెల కిశోర్ సమాధానం ఇస్తూ సిగ్గుపడుతున్న ఎమోజీలు పెట్టి “నువ్వలా చెప్పినపుడు నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి, కానీ నో ప్రాబ్లమ్.. అవి చామన ఛాయలోనే ఉన్నాయి.” అంటూ కామెడీ సమాధానం ఇచ్చాడు. ఇది వారి అభిమానులను ఆకట్టుకుంటోంది…

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news