బిగ్ బాస్ 3 లో హాట్ బ్యూటీ..!

95

గత సంవత్సరం టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి అనూహ్యంగా మారిన పరిణామాలతో విమర్శల పాలయ్యింది. కాస్టింగ్ కౌచ్ కి అందరి సహకారం అందుతున్న సమయంలో పవన్ కళ్యాన్ ని తిట్టడంతో ఆమెపై విమర్శలు పెద్దన వచ్చాయి. దాంతో శ్రీరెడ్డి కొంత కాలం ఎవరికీ కనిపించకుండా పోయింది..

ప్రస్తుతం ఆమె మద్రాస్ కి మకాం మార్చింది..అక్కడ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో పలువురు సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. తాజాగా ఇప్పుడు శ్రీరెడ్డికి సంబంధించి మరో హాట్ టాపిక్ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 3 కి ఆమె కంటిస్టెంట్ గా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే అది తెలుగులో కాదు కోలీవుడ్ లో వచ్చే బిగ్ బాస్ సీజన్ 3 కి శ్రీరెడ్డి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

కమల్ హాసన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 కి శ్రీరెడ్డిని తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అక్కడ ఎన్నో సంచలనాలు జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై అధికారి ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు శ్రీరెడ్డిని కంటిస్టెంట్ గా తీసుకోవద్దని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..మరి ఈ విషయంపై త్వరలో ఎలాంటి న్యూస్ రానుంతో వేచి చూడాలి.

Leave a comment