పవన్ పరమ భక్తుడిపై శ్రీరెడ్డి ఫైర్..!

170

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనగానే శ్రీరెడ్డి గుర్తుకు వస్తుంది. ఈ ఉద్యమం సమయంలో వ్యతిరేకంగా మాట్లాడిన టాలీవుడ్ ప్రముఖుల్ని వరుసపెట్టి టార్గెట్ చేస్తోంది. తన సంచలన తీవ్రమైన వ్యాఖ్యలతో, బూతులతో రెచ్చిపోతోంది. కొన్ని రోజులు డైరెక్టర్‌ తేజపై వరుసగా బాంబులు పేల్చింది. తాజాగా, సీనియర్ నటుడు మురళీ మోహన్ పై మాటల యుద్దాన్ని ప్రకటించింది. వంకర మాటలు మాట్లాడితే.. దేవుడు అన్ని వంచేస్తాడంటూ శాపనార్థాలు నోరు పారేసుకుంది ఈ అమ్మడు.

అంతేనా ఇప్పుడు పవన్ కళ్యాన్ పరమ భక్తుడు షకలక శంకర్ ని కూడా టార్గెట్ చేసింది. ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డు పెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు అంటూ షకలక శంకర్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. అయితే శంకర్ ని ఎందుకు టార్గెట్ చేసిందంటే..ఆ మధ్య ఓసారి తన సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి శంకర్ పరోక్షంగా విమర్శలు చేశాడు.

కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ తన నోటికి పని చేబుతుందని..ఈసారి ఎంత మందినటి టార్గెట్ చేస్తుందో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Leave a comment