శ్రీముఖి పటాస్ ఔట్..బిగ్ బాస్ 3 ఇన్..!

94

తెలుగు లో వస్తున్న కామెడీ ప్రోగ్రామ్స్ లో ఒకటి ‘పటాస్’. నటి శ్రీరెడ్డి యాంకర్ గా మారిన తర్వాత పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెతో పాటు మెయిల్ యాంకర్ రవి కూడా ఈ కార్యక్రమంతో బాగానే పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పటాస్ 2 సీజన్ మొదలవుతుంది..అయితే ఈ ప్రోగ్రామ్ లో యాంకర్ గా శ్రీముఖి ఉండటం లేదని ఈ మద్య వార్తలు వచ్చాయి.

తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. జూలై నెల రెండో వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది. హోస్ట్ గా నాగార్జునని ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, తెలుగులో బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొనబోయే 17 మంది కంటెస్టంట్ లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే బిగ్ బాస్ సీజన్ 2 లో ఇంటిసభ్యుల విషయంలో గందరగోళం ఏర్పడింది..ఆ ఇంపాక్ట్ షో రేటింగ్స్ పై కూడా పడింది.

సీజన్ 3 విషయంలో అలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో పటాస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 కంటెస్టంట్ గా ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆమె ‘పటాస్2’కి గుడ్ బాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. మరి బిగ్ బాస్ 3 లో ఈ రాములమ్మ ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.

Leave a comment