Gossipsఅభిమానుల గుండెల్లో ఆల్లజడ..జై లవ కుశని బీట్ చేసిన స్పైడర్..!

అభిమానుల గుండెల్లో ఆల్లజడ..జై లవ కుశని బీట్ చేసిన స్పైడర్..!

ఓవర్సీస్ లో మహేష్ స్టామినా గురించి ఎంత చెప్పినా తక్కువే.. సరైన సినిమా పడాలే కాని ఇక్కడ ఓ ఏరియా వసూళ్లు యూఎస్ కలక్షన్స్ తో రాబట్టే సత్తా ఉంది మహేష్ కు. అందుకే కెరియర్ లో ఇక్కడ డిజాస్టర్ అనిపించుకున్నా అక్కడ మిలియన్ డాలర్స్ తో చెడుగుడు ఆడుతుంది. ఇక రీసెంట్ గా జై లవ కుశ హిట్ టాక్ సొంతం చేసుకున్నా సరే స్పైడర్ కలక్షన్స్ వాటిని దాటేసింది.

జై లవ కుశ యూఎస్ లో 1,554,579 డాలర్లు వసూలు చేయగా.. డివైడ్ టాక్ తోనే మహేష్ స్పైడర్ 1,555,077 డాలర్స్ కలక్షన్స్ సాధించింది. మహేష్ డిజాస్టర్ మూవీ ఎన్.టి.ఆర్ బ్లాక్ బస్టర్ మూవీ కలక్షన్స్ ను బీట్ చేయడం చూస్తుంటే తెలుగు హీరోల్లో ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో మహేష్ ను బీట్ చేసే మొనగాడు ఉండడని చెప్పొచ్చు.

ఇక ఓవరాల్ కలక్షన్స్ చూసుకుంటే స్పైడర్ ఎలా లేదన్నా 50 కోట్ల దాకా లాస్ తెచ్చేలా ఉంటే. జై లవ కుశ 130 కోట్ల గ్రాస్ తో 80 కోట్ల షేర్ కలక్షన్ సాధించింది. సో బాక్సాఫీస్ దగ్గర అంత హంగామా చేసినా జై లవ కుశ యావరేజ్ మూవీ గానే మిగిలింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news