సౌరవ్ గంగూలి అభిమానులకు పండగే .. “దాదాగిరి” మొదలయింది

sourav-ganguly-biopic

బయోపిక్ సినిమాల జోష్ లో ఉన్న సినిమా పరిశ్రమ ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. క్రీడాకారుల బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. స్ప్రింటర్ మిల్కా సింగ్ కథతో బాగ్ మిల్కా బాగ్, మేరీకోం, ఎం.ఎస్.ధోని కథతో ఎం.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ ఇలా వచ్చిన అన్ని సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇక అదే క్రమంలో దాదా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి బయోపిక్ రాబోతుంది.

అయితే గంగూలి బయోపిక్ ఓ వెబ్ సీరీస్ గా వస్తుండటం విశేషం. క్రికెట్ కెరియర్ మొదలు పెట్టిన నాటి నుండి ముగించే వరకు ఎన్నో ట్విస్టులున్న గంగూలి బయోపిక్ ఓ సినిమాకు సరిపడా స్టఫ్ ఉంది కాని ఆయన జీవిత కథతో ఓ వెబ్ సీరీస్ మాత్రమే చేస్తున్నారు. జట్టులో ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉన్న గంగూలి జట్టు కెప్టెన్ గా మారి ఇండియన్ క్రికెట్ చరిత్రలో గొప్ప గొప్ప మైలు రాళ్లను దాటేశాడు.

అంతేకాదు తన కెప్టెన్సీలోనే సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్ లాంటి వారికి జట్టులో అవకాశం ఇచ్చిన ఘనత కూడా సౌరవ్ దే అని తెలిసిందే. ఇక వన్ డే క్రికెట్ కు వన్నె తెచ్చిన సౌరవ్ గంగూలి ఫిక్సింగ్ నేపథ్యంలో కష్టాల్లో ఉండగా రథసారధిగా ఇండియా జట్టుని నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచేలా చేశాడు. దాదాగిరి టైటిల్ తో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి. సచిన్ బయోపిక్ గా వచ్చిన ఏ బిలియన్ డ్రీమ్స్ డాక్యుమెంటరీగా వచ్చేసరికి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.

Leave a comment