హిట్ కొట్టాడు సిక్స్ ప్యాక్ అంటున్నాడు..!

VarunTej six pack

 

మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా హిట్ తో కెరియర్ మీద మంచి పట్టు సాధించాడని చెప్పొచ్చు. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ కంచె సినిమాతో పవార్లేదు అనిపించుకున్నా కమర్షియల్ హిట్ ఎంజాయ్ చేసింది మాత్రం ఫిదాతోనే. అఫ్కోర్స్ ఆ హిట్ లో హీరోయిన్ సాయి పల్లవి కూడా ప్రధాన కారమైనా ఫిదా అంటే వరుణ్ తేజ్ సినిమా అనే కదా చెప్పుకునేది.

ఇక ఫిదా తర్వాత ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న వెంకీ అట్లూరి సినిమా మీద దృష్టి పెట్టాడు వరుణ్ తేజ్. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడట వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఉన్న హైట్ కు సిక్స్ ప్యాక్ లాంటి బాడి ఫిట్ అంటే కచ్చితంగా సినిమా మెగా అభిమానులకు పండుగే అని చెప్పాలి. డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాను ఫిదా లాంటి హిట్ అందుకునేలా కృషి చేస్తున్నాడట.

ఇక ప్రస్తుతం తన సిక్స్ ప్యాక్ లుక్ చూపిస్తూ ట్విట్టర్ లో క్రేజీగా మారాడు వరుణ్ తేజ్. లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నానని అన్న వరుణ్ తేజ్ అది సగానికి వచ్చిందని పూర్తి చేస్తా అంటున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా తొలిప్రేమ అని పెట్టబోతున్నరని టాక్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

Leave a comment