Gossipsఇది మనవాడి అసలు మార్కెట్.. సీత షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!

ఇది మనవాడి అసలు మార్కెట్.. సీత షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్..!

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన కవచం వరకు భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చిన శ్రీనివాస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం చతికిల పడ్డాడు. అతని సినిమా అయితే బడ్జెట్, హీరోయిన్స్ విషయంలో రాజీ పడేదే ఉండదు. అయితే సినిమా సినిమాకు మనవాడి రేంజ్ తగ్గుకుంటూ వచ్చింది.

ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సీత సినిమా చేసిన శ్రీనివాస్ ఈ శుక్రవారం ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్ల లోపే అని తెలుస్తుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడ 12 కోట్లు చేసిందట. వరల్డ్ వైడ్ గా 12 కోట్ల బిజినెస్ ఇది బెల్లంకొండ బాబు అసలు మార్కెట్. ఇది కాకుండా బడ్జెట్ పెట్టాం కదా అని ఎక్కువ రేటుకి అమ్మితే డిస్ట్రిబ్యూటర్స్ లాస్ కావాల్సి వచ్చింది.

అందుకే ఈసారి బడ్జెట్ తక్కువ పెట్టి.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువ పోకుండా చేశారు. అనీల్ సుంకర, కిశోర్ బాబు కలిసి నిర్మించిన సీత సినిమా అయినా బెల్లంకొండ బాబుకి హిట్ ఇస్తుందేమో చూడాలి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. బిజినెస్ తక్కువే కాబట్టి సినిమా హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news