హీరోయిన్ డామినేషన్ స్టోరీ.. సీతని కాదన్న ఆ హీరోలెవరో..!

83

తేజ డైరక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన సినిమా సీత. రాబోయే శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమొషన్స్ లో డైరక్టర్ తేజ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా అనుకోలేదని.. కాజల్ హీరోయిన్ గా ఎంపికవగా ఒకరిద్దరు హీరోలకు ఈ కథ చెబితే హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందని సినిమా కాదన్నారట. అందుకే ఫైనల్ గా సాయి శ్రీనివాస్ ను ఓకే చేశాడట.

అల్లుడు శీను సినిమా నుండి కవచం వరకు వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని బెల్లంకొండ శ్రీనివాస్ కు సరైన హిట్టు మాత్రం దక్కలేదు. అయితే సీత సబ్జెక్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంది. సినిమా మొత్తం కాజల్ డామినేషన్ కనిపిస్తుంది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి నిజంగానే సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా ఫలితంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

ఒకవేళ తేజ అనుకున్న విధంగా ఈ సినిమా హిట్టైతే మాత్రం ఈ కథను కాదన్న హీరోలు మంచి ఛాన్స్ మిస్సయ్యామే అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా.. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా రెండు సినిమాలను వదిలేసి ఈ సీత సినిమా చేశాడు తేజ. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment