పడకగదిలోకి వస్తే ఆఫర్… డైరెక్టర్‌ను చెప్పుతో కొడతానన్నా గాయని..

88

గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో మీ టూ, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాలకు భారీ స్పందన లభిస్తుంది. బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా లేవనెత్తిన మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది నటులు, ఇతర విభాగాలకు చెందిన వారు గతంలో చేసిన లైంగిక దాడుల విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి పెద్ద ఎత్తున కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తీసుకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆమె పక్కు తప్పుకుంది.

అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ కొనసాగుతుంది..సినీ తారలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పపడి సోషల్ మీడియా వేధికగా వారి పరువు తీస్తున్నారు. గతంలో తమపై జరిగిన లైంగిక దాడు విషయాలు కూడా బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ ప్రణవి ఆచార్య తనపై జరిగిన లైంగి వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ప్రముఖ కొరియోగ్రాఫన్ రఘు మాస్టార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేను ఇంటర్మీడియెట్ చదువుతుండగా సినిమాలో పాట పాడే అవకాశం లభించింది.

ఓ డైరెక్టర్ నాకు కబురు పెట్టగా అతడి వద్దకు వెళ్లాను. మొదట నాతో బాగానే మాట్లాడిన ఆ డైరెక్టర్ తన వంకర బుద్ది చాటుకోవడం మొదలు పెట్టాడు..మాటల్లో తేడా నాకు స్పష్టంగా తెలిసింది. అలా ఆయనతో మాట్లాడుతున్న సమయంలో తన లైంగిక వాంఛ గురించి బయట పెట్టాడు..నీకు సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇప్పిస్తాను..నాతో ఒక్క నైట్ గడుపుతావా అని అడిగాడు…దాంతో నాకు ఒళ్లు మండిపోయింది.

నీకు కూతురు వయసు ఉన్నదాన్ని..నీ వయసెంత? ఈ వయసులో పిచ్చికోరికలు కోరుతావా..అని సీరియస్ అయ్యాను. అయినా అతను అలాగే మాట్లాడటం మొదలు పెట్టాడు..దాంతో చెప్పుతో కొడతా అని చెప్పు చూపించి వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చానని అన్నారు ప్రణవి. అప్పటి నుంచి నాకు ఏ ఛాన్సు మొదట అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకొని అంతా ఓకే అనుకుంటేనే మాట ఇస్తున్నానని అన్నారు.

Leave a comment