రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ సింగర్..!

22

ఈమధ్య టాలీవుడ్ లో సిని ప్రముఖుల మరణాలు అటు పరిశ్రమని ఇటు వారిని అభిమానించిన వారిని విషాదంతో నింపేలా చేస్తున్నాయి. అనారోగ్యంతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదంలో మళయాల సింగర్ మంజుషా మోహన్ దాస్ శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

మళయాల సింగర్ గా అనతికాలంలోనే అనూహ్య ప్రేక్షకాదరణ పొందిన మంజుషా మోహన్ దాస్ శుక్రవారం తాను వెళ్తున్న స్కూటీని లారీ కొట్టేయడంతో భారీగా గాయాలపాలయ్యింది. హుటాహుటిన ఆసుపత్రికి చేర్పించడంతో 24 గడిస్తేనే కాని ఏమి చెప్పలేమన్న పరిస్థితి ఏర్పడిందట. అయితే ఆమె ఈరోజు ఉదయం 4 గంటలకు మరణించినట్టు తెలుస్తుంది.

సింగర్ గా ఇంకా ఎంతో అద్భుతమైన భవిష్యత్ ఉన్న మంజుషా మోహన్ దాస్ ఇలా అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్లడం నిజంగా సిని పరిశ్రమకు షాక్ అని చెప్పాలి.

Leave a comment