” సింహనంద ” సర్ ప్రైజింగ్ లుక్..!

simahanadha-fan-made-motion-poster

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మహేష్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించేసింది. భరత్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు మహేష్. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా మొన్నటిదాకా రాజసం అని వినిపించింది.

ఇప్పుడు కొత్తగా సింహ నంద అంటూ ప్రచారం చేస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా కొత్త టైటిల్ అదేనండి సింహ నంద సర్ ప్రైజింగ్ గా ఉంది. ఇదేదో బోయపాటి శ్రీను సినిమా టైటిల్ గా అనిపిస్తుంది.

కచ్చితంగా ఈ టైటిల్ చూస్తే మహేష్ మాస్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం గడ్డం లుక్ తో కనిపించనున్న మహేష్ పక్కా రికార్డులను తిరగరాస్తాడని తెలుస్తుంది.

Leave a comment