Moviesమరో సాహసం చేస్తున్న 'సిల్లీ ఫెలోస్'

మరో సాహసం చేస్తున్న ‘సిల్లీ ఫెలోస్’

అల్లరి నరేష్, సునీల్ కథానాయకులుగా నటించిన కొత్త చిత్రం ‘సిల్లీ ఫెలోస్’ . ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. సినిమా ఆద్యంతం కామెడీ ట్రాక్ మీదే నడవనుందని సమాచారం. సినిమా పోస్టర్ లో కూడా వీరిద్దరూ చాలా సరదాగా కనిపించరు, దీన్ని బట్టే ఈ మూవీ ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అని ఇప్పటికే అర్ధం అవుతుంది. సునీల్, అల్లరి నరేష్ నిజ జీవితం లో కూడా మంచి స్నేహితులు అని మనందరికీ తెలిసిన విషయమే, కావున ఈ సినిమా లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయని చెప్పాలి.

సిల్లీ ఫెలోస్ కి భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గ పూర్ణ, చిత్ర శుక్ల నటించారు. ఈ చిత్రం లో కొన్ని సన్నివేశాలు మినహా సినిమా మొత్తం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇక ఈ సినిమాని జులై మొదటి వారం లో విడుదల చేయాలనీ చిత్ర బృందం ఆలోచన. బ్లూ ప్లానెట్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news