చెప్పుతో కొట్టమంటున్న సిద్ధార్ధ ..!

siddharth new

తెలుగు, తమిళ ఇండ్రస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ ‘బొమ్మరిల్లు’తో తెలుగులో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా మళ్లీ ఆ స్థాయి విజయం అందుకోలేక పోయాడు.త్వరలో సిద్ధార్థ్ ‘గృహం’ అనే హారర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి విశేషాలు చెప్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఇకపై చెత్త సినిమాలు తీస్తే చెప్పుతో కొట్టమని కోరాడు. ఆయన తాజా చిత్రం ‘గృహం’. తమిళ్ లో ఇప్పటికే రిలీజై సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమా (శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నిన్న సిద్ధార్థ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

‘ఇప్పటి వరకు అన్నీ మంచి సినిమాలే చేశా. చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి. కెరీర్ పరంగా తానెప్పుడూ కిందకు పడిపోలేదు. కేవలం బ్రేక్ మాత్రమే తీసుకున్నా. పదేళ్ల క్రితం ఒకటి, ఐదేళ్ల క్రితం ఒక ఘటన తన జీవితంలో జరిగాయి. వాటి వల్ల తప్పేదో, ఒప్పోదో తెలిసింది’ అని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ ఘటనలు ఏంటన్నది మాత్రం చెప్పలేదు.గృహం సినిమాలో సిద్ధార్థ్ కి జంటగా ఆండ్రియా జతకట్టనుంది.

ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్, కో-రైటర్ గా కూడా సిద్ధార్థ్ వ్యవహరించాడు. హాలీవుడ్ తరహాలో సీరియస్ హారర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిలింద్ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించారు.

Leave a comment