Gossipsఅరవింద సమేతకి అమితాబ్ షాకింగ్ సర్ ప్రైజ్..!

అరవింద సమేతకి అమితాబ్ షాకింగ్ సర్ ప్రైజ్..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా నుండి స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ నే కాదు సిని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. అదేంటి అంటే అరవింద సమేత సినిమాలో బిగ్ బీ అమితాబ్ నటిస్తుండటమే. ఎన్.టి.ఆర్ అరవింద సమేతలో ఓ చిన్న కేమియో రోల్ లో అమితాబ్ కనిపించనున్నాడట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.

సినిమాలో చిన్న పాత్రే అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి బాగా తెలిసిన వారైతే బెటర్ అని అమితాబ్ ను సంప్రదించారట చిత్రయూనిట్. అది కూడా చివరి నిమిషంలో జరిగిందట. మొత్తానికి ఎన్.టి.ఆర్, అమితాబ్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ కు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

దసరా బరిలో రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఓ పక్క తండ్రి హరికృష్ణ మరణంతో బాధలో ఉన్నా సినిమా కోసం ఎన్.టి.ఆర్ రెగ్యులర్ గా షూటింగ్ కు వస్తున్నాడట. అరవింద సమేత పూర్తి చేశాక కొద్దిపాటి గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news