శింబు ఖాతాలోకి బిగ్ బాస్ పాప..? ఈమెను కూడా వదల్లేదా….?

shimbu twitter twits about tamil big boss girl oviya

సామాజిక మాధ్యమాల వలన ఏ ప్రముఖ వ్యక్తి కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదేమో.మొన్నటికి మొన్న రకుల్ ఇంటి గురించి అయితే…ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి తమిళ హీరో శింబు కి అంటుకుంది.

తమిళ ‘బిగ్‌బాస్‌’ లోని హౌస్ మెట్ అయిన ఓ నటికి మద్దతుగా శింబు ఇటీవల ఓ ట్వీట్‌ చేసినట్లు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తీవ్రమైన ప్రచారం జరిగింది. ఆ నటిని తాను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడమే ఆ ట్వీట్‌ లోని ముఖ్యమైన విషయం. ఈ విషయంపై త్వరగానే స్పందించిన శింబు వెంటనే ఓ ప్రకటన విడుదల చేశారు.

తన పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా ఎవరో పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం పూర్తిగా అబద్దం…ఆ ప్రకటన చేసిన ఖాతా నాది కాదు ఎవరో కావాలని నా పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఖాతా ప్రారంభించి.. ఇలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఆ వార్తలను నమ్మి నిజం తెలుసుకోకుండా అవాస్తవాన్ని ప్రసారం చేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలా నకిలీ ఖాతా నుంచి వచ్చిన విషయాన్ని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని, తన నుంచి అధికారికంగా వచ్చిన విషయాలు ఏమి అయినా ఉంటే ప్రచారం చేయాలంటూ ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment